100 శాతం సక్సెస్ రేటుతో HIV ఎయిడ్స్‌కు వ్యాక్సిన్ పని చేస్తోంది. లెనాకాపవిర్(Sunlenca బ్రాండ్) అనే డ్రగ్‌తో ఏడాదికి 2 టీకాలు వేయడం ద్వారా దీన్ని నివారించవచ్చని తేలింది. 5వేల మంది మహిళలపై నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్‌లో 100 శాతం ప్రభావవంతంగా పనిచేసినట్లు వెల్లడైంది. ఇది ఎయిడ్స్ నివారణలో కీలక మలుపు అని గిలియడ్ కంపెనీ తెలిపింది. అమెరికా, కెనడా, ఐరోపా దేశాల్లో వ్యాక్సిన్ అందుబాటులో ఉందని, 120 పేద దేశాల్లో తక్కువ ధరకు అందిస్తామని ప్రకటించింది.