బాసరలో ఘనంగా వసంత పంచమి వేడుకలు

73చూసినవారు
బాసరలో ఘనంగా వసంత పంచమి వేడుకలు
తెలంగాణలోని బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అర్చకులు అమ్మవారి జన్మదినాన్ని పురస్కరించుకుని 108 కలశాలతో జలాలను తెచ్చి అభిషేకం నిర్వహించారు. పద్మశాలి సంఘం తరుపున ఆందజేసిన చేనేత పట్టువస్త్రాలతో అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి సేవలో ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్