మెదక్ జిల్లాలో బుధవారం పలువురు ప్రముఖులు పర్యటించనున్నారు. తునికి కృషి విజ్ఞాన కేంద్రంలో సేంద్రీయ పంటలు పండిస్తున్న 500 మంది రైతులతో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కడ్, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు. అటు సీఎం రేవంత్ కూడా బుధవారం ఏడు పాయల వనదుర్గ అమ్మవారిని దర్శించుకుంటారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత మెదక్ చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారు.