తెలంగాణలో పెండింగ్ స్కాలర్షిప్స్ విడుదల చేయాలంటూ సెక్రటేరియట్ ను ముట్టడించడానికి విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. దీంతో భారీ సంఖ్యలో తరలివచ్చిన ఆందోళనకారులు.. సెక్రటేరియట్ ముట్టడికి యత్నించారు. బీఆర్కే భవన్ వద్ద పోలీసులు వీరిని అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఆందోళనకారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తుండగా.. పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.