TG: ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ విద్యార్థినులకు మంచి మాటలు చెప్పడంతో ఆయనపై ప్రశంసల కురుస్తున్నాయి. ఆయన డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ సెంటెనరీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గర్ల్స్ జూ. కాలేజీని సందర్శించి.. నేలపై కూర్చుని విద్యార్థులతో మాట్లాడారు. 'లైఫ్‌లో పెద్ద లక్ష్యాలను పెట్టుకోవాలి. నెగటివ్‌గా ఎవరు మాట్లాడినా వదిలేయండి. సవాళ్లను ఎదుర్కొని లక్ష్యం వైపు ముందుకు సాగాలి' అని ఆయన ప్రేరేపించారు.