VIDEO: అంబులెన్స్‌లో తరలిస్తున్న రూ.కోట్ల విలువైన గంజాయిని కొత్తగూడెంలో పట్టివేత.. ఇద్దరి అరెస్టు

69చూసినవారు
ఆంధ్రా-ఒడిశా బార్డర్ నుంచి తమిళనాడుకు అంబులెన్స్‌లో తరలిస్తున్న గంజాయిని భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో పోలీసులు పట్టుకుని, ఇద్దరిని అరెస్టు చేశారు. ఆ అంబులెన్స్ టైర్ కొత్తగూడెం వద్ద పేలడంతో రిపేర్ చేసేందుకు సహకరించిన స్థానికులు గంజాయి పొట్లాలను గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం బయటపడింది. 3 క్వింటాళ్ల సరుకును పట్టుకున్నారని, దీని విలువ సుమారు రూ.2 కోట్లు ఉంటుందని సమాచారం.

సంబంధిత పోస్ట్