మెగా పవర్‌స్టార్
రామ్‌చరణ్ ప్రపంచవ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. అయితే సినిమాల్లోకి రాకముందు చరణ్ యాక్టింగ్ స్కూల్లో శిక్షణ తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూస్తే యాక్టింగ్ స్కూల్లో చరణ్‌కు మొదటి రోజు అని తెలుస్తోంది. తన శిక్షణ ప్రారంభించే ముందు స్టేజ్ భయం పోవడానికి కాసేపు వ్యాయామం చేయించారు. చరణ్ కాస్త భయపడుతూ, మొహమాటపడుతూ వ్యాయామం చేస్తూ కనిపిస్తున్నారు.