లేడీస్ వాష్‌రూమ్ చెత్త‌డ‌బ్బాలో మొబైల్ పెట్టి వీడియో రికార్డ్

572చూసినవారు
లేడీస్ వాష్‌రూమ్ చెత్త‌డ‌బ్బాలో మొబైల్ పెట్టి వీడియో రికార్డ్
బెంగళూరులోని థర్డ్‌ వేవ్ కాఫీ ఔట్‌లెట్‌లో ప‌ని చేస్తున్న ఓ ఉద్యోగి అత్యంత నీచ‌మైన చ‌ర్య‌కు పాల్ప‌డ్డాడు. లేడీస్ వాష్‌రూమ్‌లోని డ‌స్ట్‌బిన్‌లో సెల్‌ఫోన్‌ను ఫ్లైట్ మోడ్‌లో పెట్టి వీడియో రికార్డు చేశాడు. దీన్ని గ‌మ‌నించిన ఓ మ‌హిళ‌.. కాఫీ షాపు యాజ‌మాన్యానికి ఫిర్యాదు చేసింది. ఈ ఫోన్ దాదాపు 2 గం పాటు రికార్డింగ్ మోడ్‌లో ఉన్న‌ట్లు తేలింది. ఈ విషయాన్ని గ్యాంగ్స్ ఆఫ్ సినీపుర్ ఇన్‌స్టా ఖాతాలో పేర్కొనడంతో వైరల్ అవుతోంది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్