ఆధార్ కార్డు ఉన్నవారికి శుభవార్త. కేంద్రం అందుబాటులోకి తీసుకొచ్చిన కొత్త ఆధార్ యాప్ ద్వారా ఫేస్ ID అథంటికేషన్ పూర్తి చేయవచ్చని కేంద్ర మంత్రి వైష్ణవ్ వెల్లడించారు. వినియోగదారులు హోటల్స్, షాప్స్ పాటు ఎక్కడైనా స్కాన్డ్ కాపీ, ఫిజికల్ డాక్యుమెంట్ ఇవ్వాల్సిన పని లేదన్నారు. ఈ మొబైల్ అప్లికేషన్ ద్వారా QR కోడ్ స్కాన్ చేసి ఆధార్ స్టేటస్ ను వెరిఫై చేసుకోవచ్చని తెలిపారు. ఈ యాప్ 100% సెక్యూర్డ్ అని.. ప్రస్తుతం బీటా టెస్టింగ్ దశలో ఉందని పేర్కొన్నారు.