SLBC టన్నెల్ వద్ద ఉత్కంఠ కొనసాగుతుంది. టన్నెల్‌లో 8 మంది కార్మికులు చిక్కుకొని 96 గంటలు కావొస్తున్నా రెస్క్యూ బృందాలు ఇప్పటి వరకు వారిని కాపాడలేకపోయాయి. అయితే ప్రభుత్వం కార్మికులను ఎలాగైనా కాపాడాలని సహాయక చర్యలు ముమ్మరం చేసింది. రెస్క్యూ బృందాలు సైతం ఇప్పటికే కార్మికుల సమీపం వరకు చేరుకున్నాయని ఇంకా 40 మీటర్ల లోపలికి వెళ్లగలిగితే కార్మికులు చిక్కుకున్న చోటికి చేరకుంటాయని అధికారులు వెల్లడిస్తున్నారు.