TG: భువనగిరి పట్టణం విద్యానగర్‌లో ఏఆర్ కానిస్టేబుల్ మంగళవారం ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. సిద్దిపేట(D) కోహెడ(M) వరికోల్‌కు చెందిన మామిడాల అనూష (30) AR కానిస్టేబుల్‌గా భువనగిరిలో విధులు నిర్వర్తిస్తున్నారు. అనూషకు ఓ యువకుడితో ఈ నెల 14న ఆమెకు వివాహ నిశ్చితార్థం జరిగింది. మార్చి 6న వివాహం జరగాల్సి ఉంది. ఇంతలోనే అనూష ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రలు బోరున విలపించారు. పెళ్లి ఇష్టం లేకనే సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది.