VIDEO:తల్లి కళ్ల ముందే చిన్నారిని తొక్కేసిన కారు

58చూసినవారు
యూపీలోని నోయిడాలో శుక్రవారం రాత్రి విషాద ఘటన జరిగింది. ఓ బాలిక తమ ఇంటి ముందు తల్లితో కలిసి ఆడుకుంటోంది. ఆ సమయంలో ఓ కారు వేగంగా దూసుకొచ్చింది. చిన్నారిని ఢీకొట్టి, తొక్కుకుంటూ పోయింది. తల్లి కళ్ల ముందే ఆ చిన్నారి కారు చక్రాల కింద నలిగిపోయింది. తీవ్రంగా గాయపడిన ఆ బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. పాప పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్