తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ పాఠశాలల యూనియన్ ట్రస్మా ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని క్రౌన్ గార్డెన్స్ లో శుక్రవారం జరిగిన ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన సభలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొని ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులను సన్మానించారు. మహమ్మదాబాద్ మండల కేంద్రంలోని న్యూ బ్రిలియంట్ పాఠశాల నుంచి ఎంపిక అయిన భారతి అలాగే సుదర్శన్ లను సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం హర్షం వ్యక్తం చేసారు. ప్రభుత్వ ఉపాధ్యాయుల తో సమానంగా ప్రైవేటు ఉపాధ్యాయులకు కూడా ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం చేసేందుకు ముందుకు వచ్చిన ట్రాస్మా సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ అందర్నీ ప్రోత్సహిస్తున్న జిల్లా అధ్యక్షులు ప్రభాకర్ అలాగే రాష్ట్ర బాధ్యులు పాపిరెడ్డి లకు పాఠశాల యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా రాష్ట్ర సభ్యులు, జిల్లా సభ్యులు, మండల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, బ్రిలియంట్ పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ శరత్ చంద్ర, హనుమంత్ రెడ్డి, ప్రిన్సిపల్, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.