సైబర్ నేరగాళ్లతో జాగ్రత్తగా ఉండాలని పరిగి ఎస్సై సంతోష్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. రైతు రుణమాఫీ డబ్బులు కాజేసేందుకు సైబర్ నేరగాళ్లు ప్రయత్నిస్తుంటారని, అలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలని అన్నారు. బ్యాంకు లోగోలతో వాట్సాప్ గ్రూపులో మెసేజ్ లు పంపి మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. అలాంటి మెసేజ్, ఫోన్ లకు స్పందించకూడదన్నారు.