ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉన్న పరిగి ఆర్టీసీ డిపో ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉంది. దీనికి కారణం అధికారుల నిర్లక్ష్యం ముందుచూపు లేకపోవడమే అని పలువురు ఉద్యోగులు ప్రజలు ఆరోపిస్తున్నారు. రైలు వసతి లేని పరిగి నుండి సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రజలు హైదరాబాద్ లేదా షాదనగర్ నుండి వెళ్లాల్సి వస్తుంది. హైదరాబాద్ నాన్ స్టాప్ బస్సులతో పాటు. శ్రీశైలం తిరుపతి వంటి దూర ప్రాంతాలకు బస్సు సర్వీసులు ప్రారంబించడం ద్వారా ఆదాయాన్ని పొందవచ్చని పలువురు ఉద్యోగులు అభిప్రాయాన్ని తెలిపారు. కొడంగల్ పరిగి మధ్యలో మినీ పల్లెవెలుగు బస్సులను నడిపితే ఆ దారిలో ఉన్న గ్రామాల్లోకి తిప్పితే ఆర్టీసీ పైన ప్రజలు ఇంకా నమ్మకన్నీ పెంచుకుంటారని తద్వారా లాభాలు గడించవచ్చని పలువురు అభిప్రాయపడ్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బస్ దారులతో పాటు బస్ స్టాండ్ ని కూడా శుభ్రపరచాలని. కోరుతున్నారు.