దోమ మండలంలోని గుండాల గ్రామానికి చెందిన శతాధిక వృద్ధుడు చిన్నమల్లి మల్లప్ప(110) మృతి చెందారు. చనిపోయిన మల్లప్పకు ఐదుగురు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. ఇన్నాళ్లు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా జీవించారని కుటుంబ సభ్యులు తెలిపారు. మల్లప్ప భౌతికకాయానికి కాంగ్రెస్ నేతలు నివాళి అర్పించారు. అనంతరం మృతుని కుటుంబానికి రూ. 5 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.