ముదిరాజులకు జనాభా ప్రాతిపదికన ముదిరాజుల రిజర్వేషన్ బీసీడీ నుంచి బీసీ ఏకు మార్చిన జీవో ఎంఎస్ నెం. 15ను పునరుద్ధరించి, కాంగ్రెస్ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ వాగ్దానాన్ని ప్రభుత్వం ద్వారా అమలు చెయ్యాలని దోమ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో గురువారం దోమ ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేశారు. తెలంగాణలో అత్యధిక జనాభా ఉన్న ముదిరాజులకు రిజర్వేషన్ కల్పించి స్థానిక ఎన్నికల్లో అవకాశం కల్పించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.