పరిగి మహబూబ్ నగర్ ప్రధాన రహదారిలో కులకచెర్ల మండలం పుట్టపహాద్ గ్రామం రహదారి పూర్తిగా దెబ్బతిని 4 అడుగుల మేర గుంతలు అయ్యి రాకపోకలకు చాలా సమస్యగా మారింది. ప్రజాప్రతినిధులు ఎవరు కూడా సమస్యను పరిష్కరించడం లేదని పలువురు ప్రజలు వాపోతున్నారు. ఎలాగైనా అధికారులు ప్రజాప్రతినిధులు సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలని కోరుతున్నారు.