అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందుతాయని అడిషనల్ కలెక్టర్ మోహన్ రావు తెలిపారు. మంగళవారం మహ్మదాబాద్ మండల పరిధిలోని వెంకట్ రెడ్డిపల్లి, కంచింపల్లి ముకర్లబాద్ గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ చిన్న చిన్న పొరపాట్లు జరిగిన అర్హులకు ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇందిరమ్మ ఆత్మీయ రైతు భరోసాలో అర్హులైన వారిని కాకుండా అనర్హులను ఎంపిక చేశారని గ్రామస్తులు ఆందోళన చేశారు.