వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో సోమవారం విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో హిందూ ఉత్సవ కమిటీ నేతలు తిరుమల లడ్డు పవిత్రతను కాపాడాలని నిరసన ర్యాలీ నిర్వహించారు. కల్తీ లడ్డుకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, హిందూ దేవాలయాలను ప్రభుత్వ ఆధీనంలో నుండి తొలగించి స్వతంత్ర హోదా కల్పించాలని డిమాండ్ చేశారు.