గత సెప్టెంబర్ నెలలో దూర ప్రాంతాలకు పరిగి నుండి సర్వీసులు నడపడం ద్వారా అదాయం వస్తుంది అని ప్రచురించిన వార్తకు స్థానిక డిపో డీఎం స్పందించి పరిగి నుండి తిరుపతికి ప్రతి నెల 6వ తారీకు సర్వీసును ప్రారంభించారు. ఒకే సర్వీసు అనుకున్న చోట మూడు సర్వీసులు పూర్తి స్థాయిలో సీట్లు నిండి నడుస్తూ మంచి ఆదాయాన్ని సామకూరుస్తున్నాయి. త్వరలో ఈ సర్వీసుని ప్రతి రోజు నడిపేలా చూస్తామని డిపో డీఎం తెలిపారు. ఇలాంటి వార్తలతో డిపో ఆదాయానికి సహకరిస్తున్న లోకల్ న్యూస్ వారికి డీఎం ధన్యవాదాలు తెలిపారు.