ట్విట్టర్ లో చురుగ్గా స్పందిస్తున్న ఆర్టీసీ ఎండీ సజ్జనార్

1037చూసినవారు
ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించినతరవాత ఆర్టీసీ బలోపేతానికి సజ్జనార్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలను ఆర్టీసీ ప్రయాణం వైపు ఆకర్షించేలాగా ఉన్నాయి. ట్విట్టర్లో ప్రజలకు అందుబాటులో ఉండి ఏ సమస్య వచ్చినా చిటికెలో సజ్జనార్ పరిష్కరిస్తున్నారు. 25. 12. 21 నాడు పరిగి నుండి షాదనగర్ వెళ్లే బస్సులో వాహన చోదకుడు చరవాని ఉపయోగిస్తూ బస్ నడపడం, మాస్క్ లేకుండా ఉండటాన్ని గమనించిన ప్రయాణికులు చరవణిలో వీడియో తీసి #tsrtcmdoffice కి టాగ్ చేయగా వెంటనే స్పందించిన సజ్జనార్ డిపో మేనజర్లకు సూచన చేయడం 5 నిమిషాల్లోపు సమస్యను పరిష్కరించడం పట్ల ప్రయాణికు లు సంతోషం వ్యక్తం చేశారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్