ధరూర్: సకాలంలో స్పందించిన విద్యుత్ అధికారులు

68చూసినవారు
ధరూర్: సకాలంలో స్పందించిన విద్యుత్ అధికారులు
వికారాబాద్ జిల్లా ధరూర్ మండలం ఎల్లనూర్ గ్రామంలో గత రెండు రోజులుగా వర్షాల వలన కరెంట్ లేక, నీళ్లు రాక గ్రామ ప్రజలు ఇబ్బందులు పడుతుండడంతో శనివారం మాజీ సర్పంచ్ శ్రీకాంత్ రెడ్డి చొరవ తీసుకున్నారు. ఆయన స్థానిక విద్యుత్ శాఖకు తెలియజేయడంతో ఏఈ వేణుగోపాల్ రెడ్డి సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకొని తెగిన విద్యుత్ తీగలను సరిచేసి విద్యుత్ సప్లై అందించారు. గ్రామ ప్రజలు వారికి ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్