ఉపాధ్యాయుల కృషి అభినందనీయం: స్వప్న పరిమల్

1062చూసినవారు
ఉపాధ్యాయుల కృషి అభినందనీయం: స్వప్న పరిమల్
విద్యార్థుల అవగాహన కొరకు ఉపాధ్యాయులు తయారు చేసిన బోధనాభ్యాసన సామాగ్రి చాలా బాగుంది అన్నారు తాండూర్ మున్సిపల్ ఛైర్పర్సన్ స్వప్న పరిమల్. బుధవారం మున్సిపల్ పరిధిలోని నంబర్ వన్ పాఠశాలలో జరుగుతున్న" భోధనాభ్యాసన సామాగ్రి మేళాను "చైపర్సన్ సందర్శించారు. అనంతరం ఛైర్పర్సన్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల సృజనాత్మకతను , శ్రమను అభినందించారు. ఈ కార్యక్రమంలో విద్యాధికారి వెంకటయ్య గౌడ్, నోడల్ అధికారి మృత్యుంజయ స్వామి, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు వైజ్య నాథ్, లక్ష్మయ్య, ఉపాధ్యాయ సంఘాల నేతలు వెంకటప్ప, పురుషోత్తం రెడ్డి, శ్రీనివాస్, ఉపాధ్యాయులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్