ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న తొలిమెట్టు కార్యక్రమం అమలు చేయుటకు తాండూర్ ఉపాధ్యాయులు నడుము బిగించడం పట్ల తనిఖీ అధికారులు సంతృప్త వ్యక్తం చేస్తున్నారు.
శుక్రవారము మండల విద్యాధికారి వెంకటయ్య గౌడ్, నోడల్ అధికారి మృత్యుంజయ స్వామి మండల పరిధిలోని గౌతపూర్, బెల్కటూర్, కరణ్ కొట్, సంకిరెడ్డి పల్లి పాఠశాలలను తనిఖీలు చేశారు.
ఈ సందర్భంగా ఉపాధ్యాయుల పనితీరు ను, విద్యార్థుల అభ్యసన స్థాయి ని తనిఖీ చేశారు. ఉపాధ్యాయుల బోధన, విద్యార్థుల స్థాయి పట్ల వారు సంతృప్త వ్యక్తం చేస్తూ విద్యార్థులకు చాకొలేట్ ఇచ్చి దీవించారు, ఉపాహ్యాయులను, ప్రధానోపాధ్యాయులు ను అభినందిచారు. ఈ తనిఖీల్లో అయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, రామ్ నరసింహ రెడ్డి, నర్సిరెడ్డి, తిరుపతి, సిఅర్పీ అమ్రేష్ ఉన్నారు.