బంగ్లాదేశ్‌లో హింస.. రిజర్వేషన్ల కోటా తగ్గించాలని సుప్రీం ఆదేశం

61చూసినవారు
బంగ్లాదేశ్‌లో హింస.. రిజర్వేషన్ల కోటా తగ్గించాలని సుప్రీం ఆదేశం
బంగ్లాదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల దృష్ట్యా ఆ దేశ సుప్రీంకోర్టు ఆదివారం కీలక తీర్పు వెలువరించింది. స్వాతంత్య్ర ఉద్యమంలో పోరాడిన వాళ్ల కుటుంబాలకు రిజర్వ్‌ చేసిన 30% రిజర్వేషన్‌ కోటాను 5%కి తగ్గించాలని ఆదేశించింది. 93శాతం ఉద్యోగాలు ప్రతిభ ఆధారంగా భర్తీ చేయాలని స్పష్టం చేసింది. మిగతా రెండు శాతం ఉద్యోగాలను మైనార్టీలు, ట్రాన్స్‌జెండర్లు, వికలాంగులకు కేటాయించాలని పేర్కొన్నది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్