వైరల్ వీడియో: తాగొచ్చిన టీచర్‌.. తరిమికొట్టిన స్టూడెంట్స్

70చూసినవారు
స్కూల్‌కి తాగొచ్చిన టీచర్‌ను విద్యార్థులు తరిమేసిన ఘటన ఛత్తీస్‌గఢ్‌లో చోటుచేసుకుంది. బస్తర్‌లోని పిలిభట్ట ప్రాథమిక పాఠశాలకు ప్రతి రోజూ తాగొచ్చి తమను దుర్భాషలాడుతూ, పాఠాలు చెప్పకుండా నిద్రపోతున్న ఓ టీచర్‌ చేష్టలతో విసిగిపోయిన ఆ స్కూల్ స్టూడెంట్లు అతనికి తగిన గుణపాఠం చెప్పారు. అతడిపై చెప్పులు విసురుతూ వెంటాడి మరీ స్కూలు ప్రాంగణం నుంచి తరిమేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌‌గా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్