ఆర్‌సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. మొత్తం ఐపీఎల్ సీజన్లలో కలిపి ఒకే వేదికలో 3000 కంటే ఎక్కువ పరుగులు చేసిన ఏకైక ప్లేయర్‌గా కోహ్లీ నిలిచాడు. ఇవాళ బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో 47 పరుగులు చేసి ఔటైన కోహ్లీ ఈ రికార్డును అందుకున్నాడు. ఇక ఆ తర్వాతి స్థానంలో రోహిత్ శర్మ ముంబై జట్టు నుంచి తమ హోం గ్రౌండ్‌లో 2295 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు.