ఇంగ్లాండ్ స్పిన్నర్ రెహన్ అహ్మద్‌కు వీసా కష్టాలు ఎదురయ్యాయి. సింగిల్ ఎంట్రీ వీసాతో ఇండియాకు వచ్చిన రెహన్.. రెండో టెస్టు అనంతరం దుబాయ్ వెళ్ళిన విషయం తెలిసిందే. అయితే మూడో టెస్టు కోసం రాజ్‌కోట్ చేరుకున్న అతనికి అధికారులు ఎంట్రీ ఇవ్వలేదు. దీంతో అతను మళ్లీ పేపర్‌వర్క్ చేయాల్సి వచ్చింది. దీనిపై ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తక్షణమే స్పందించింది. అధికారులు రెహన్ కు తాత్కాలిక వీసా జారీ చేసినట్లు వెల్లడించింది.