AP: విశాఖపట్నం పోర్టు అథారిటీ 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొదటి మూడు త్రైమాసికాల్లో 60 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్గోను నిర్వహించడం ద్వారా 91 ఏళ్ల పోర్ట్ చరిత్రలో ఒక సువర్ణ ఘట్టాన్ని నమోదు చేసిందని విశాఖ పోర్టు చైర్మన్ డాక్టర్ ఎం.అంగముత్తు తెలిపారు. 2023-24లో మొదటి మూడు త్రిమాసికాలలో చేసిన 59.73 మిలియన్ మెట్రిక్ టన్నుల రికార్డును అధిగమించి నూతన రికార్డ్ ను నెలకొల్పినట్టు పేర్కొన్నారు.