వాటికి వ్యతిరేకంగా ఓటు వేశా: కేజ్రీవాల్

51చూసినవారు
వాటికి వ్యతిరేకంగా ఓటు వేశా: కేజ్రీవాల్
లోక్‌సభకు శనివారం జరుగుతున్న 6వ దశ పోలింగ్‌లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కుటుంబ సభ్యులతో కలిసి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. దేశ వ్యాప్తంగా పెరుగుతున్న నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, నియంతృత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశానని తెలిపారు. ‘మా నాన్న, భార్య, ఇద్దరు పిల్లలందరూ ఓటు వేశారు. ఆరోగ్యం బాలేకపోవడంతో అమ్మ ఓటు వేయలేకపోయారు. నియంతృత్వానికి, ద్రవ్యోల్బణం, నిరుద్యోగానికి వ్యతిరేకంగా నేను ఓటేశాను’ అని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్