సర్వసభ్య అధికారుల గైర్హాజరు

477చూసినవారు
సర్వసభ్య అధికారుల గైర్హాజరు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ రావు మండల కేంద్రమైన తాడిచర్ల లోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిడిఓ నరసింహమూర్తి ఆధ్వర్యంలో ఎంపిపి చింతలపల్లి మల్హర్ రావు అధ్యక్షతన శనివారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి విద్యా, వైద్యం, ఎక్సైజ్, ఫారెస్టు, తహసీల్దార్ తో పాటు కొందరు అధికారులు గైర్హాజరు కావడంతో ప్రజాప్రతినిధులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను గాలికి వదిలేసి అధికారులు విధులను విస్మరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ నిర్వహణలో ఎంపిడిఓ సైతం అధికారులను హజరు పరచడంలో విఫలం అయ్యారని ఆరోపించారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు అధికారుల వధ్జ సమాధానమే కరువైంది. గత మూడు నెలర క్రితం జరిగిన సమావేశంలో సభ్యులు అడిగిన సమస్యలు ఇప్పటి వరకు పరిష్కారం కాలేదని అలాంటప్పుడు సమావేశాలేందుకంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని అంగన్వాడీ కేంద్రాల్లో కుళ్లిన గ్రుడ్డును పిల్లలకు పెడుతున్నారని సభ్యులు నిలదీశారు. ఈ సమావేశంలో జెడ్పీటీసీ ఐత కోమల, వైస్ ఎంపిపి బడికెల స్వరూప, ఎంపిఓ విక్రమ్, ఏఈ పిఆర్ అశోక్ కుమార్, సర్పంచులు రమేష్, లింగమూర్తి, రాజు నాయక్, ఎంపిటిసి సభ్యులు నాగరాణి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్