పోడు భూముల పేరిట అటవీ నరికివేతకు యత్నం.. కేసు నమోదు

1257చూసినవారు
పోడు భూముల పేరిట అటవీ నరికివేతకు యత్నం.. కేసు నమోదు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ రావు మండలంలోని కొయ్యుర్ రేంజ్ పరిధిలోని ఎడ్లపల్లి, శభాష్ నగర్ బిట్ పరిధిలో అటవీ అధికారులు మొక్కలు నాటిన ప్లాoటేషన్ లో పోడు భూముల పేరిట నూతనంగా పొడు చేసేందుకు యాత్నించిన కాటారం మండలంలోని శంకరంపల్లి, దేవరాంపల్లి గ్రామాలకు చెందిన 20మందిపై కేసులు నమోదు చేసినట్లుగా కొయ్యుర్ ఇంచార్జీ రేంజర్ నరేశ్, డిప్యూటీ రేంజర్ కొమురయ్య తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం మధ్యాహ్నం ఎడ్లపల్లి బిట్ లో గత రెండు సంవత్సరాల క్రితం నాటిన ప్లాoటేషన్ లో అక్రమంగా కొత్తగా పొడు చేసేందుకు మొక్కలు నరుకుతున్నారని సమాచారం అందగా సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించగా మొక్కలు నరికిన సంబంధించిన వ్యక్తుల పై కేసులు నమోదు చేసినట్లుగా తెలిపారు. పూర్తి సమాచారం సేకరించిన అనంతరం కేసు నమోదు చేసిన వారిని కోర్టులో హాజరు పరుస్తున్నట్లు అటవీశాఖ అధికారులు పేర్కొన్నారు. ఫారెస్టు బిట్ అధికారి సాయి కృష్ణ, కొయ్యుర్ పోలీసులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్