జయశంకర్ భూపాలపల్లి జిల్లా గోరి కొత్తపల్లి మండల ఎంపీడీవోకు మంగళవారం తెలంగాణ చిందు విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు గడ్డం ప్రశాంత్ వినతిపత్రం అందజేశారు. ప్రశాంత్ మాట్లాడుతూ.. గత 20 సంవత్సరాలుగా మండలంలోని చెన్నాపూర్ గ్రామం అమరావతి కాలనీలో నివాసముంటున్న చిందు కళాకారులు ఏ ప్రభుత్వ పథకానికి నోచుకోలేదని అన్నారు. కాగా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన గృహలక్ష్మి పథకం కింద ప్రత్యేక చొరవ తీసుకుని ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరారు.