గణపురం మండలంలోని కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్లలో గురువారం భూపాలపల్లి సర్కిల్ ఇన్ స్పెక్టర్ దొమ్మాటి నరేష్ కుమార్ గౌడ్ గణపేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు వారిచే మొదట గణపతి, నందీశ్వరునికి తర్వాత భవాని మాతకు, స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆశీర్వచనాలు, తీర్ధ ప్రసాదాలు అందజేశారు.