సభా ప్రాంగణాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ

548చూసినవారు
సభా ప్రాంగణాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ
జయశంకర్ జిల్లా రేగొండ మండల కేంద్రంలో మంగళవారం నిర్వహించనున్న కాంగ్రెస్ జన జాతర బహిరంగ సభ ప్రాంగణాన్ని సోమవారం జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే పరిశీలించారు. బహిరంగ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. సభా ప్రాంగణం, వాహనాల పార్కింగ్ తో పాటు హెలిప్యాడ్ దిగే స్థలాన్ని ఎస్పీ పరిశీలించి పలు సూచనలు చేశారు. వారి వెంట డిఎస్పి సంపత్ రావు, చిట్యాల సిఐ మలేష్, ఎస్సై రవికుమార్ ఉన్నారు.

సంబంధిత పోస్ట్