వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ ను అందించాలని సీజీఆర్ఎఫ్ ఛైర్మెన్ ఎన్ వి వేణుగోపాలచారి అన్నారు. శనివారం దామెర మండల కేంద్రంలోని రైతు వేదికలో సబ్ డివిజనల్ స్థాయి విద్యుత్ వినియోగదారుల సదస్సు నిర్వహించగా ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. సకాలంలో కొత్త సర్వీసులను మంజూరు చేసి, బిల్లింగ్ సమస్యలు త్వరితగతిన పూర్తి చేసి సేవలు అందించాలని తెలిపారు.