జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహముత్తారం మండలంలోని మీనాజిపేట గ్రామానికి చెందిన ఇప్పలపల్లి రమాదేవి ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురై నిమ్స్ ఆసుపత్రి లో చికిత్స పొందుతు ఆర్థిక ఇబ్బందులు పడుతుండగ స్థానిక టిఆర్ఎస్ నాయకులు పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు కు విషయం తెలుపగా స్పందించిన వారు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ 2 లక్షల ఎల్ఓసిని మంజూరు చేయించారు. కాగా మంజూరైన ఎల్ఓసిని శనివారం పుట్ట మధు తనయుడు టిఆర్ఎస్ యవ నాయకులు పుట్ట శ్రీహర్ష బాధితులకు అందజేసి అధైర్య పడవద్దని అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.