జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ రావు మండల కేంద్రమైన తాడిచర్ల లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని కార్తీక క్షిరాబ్ది ద్వాదశి సందర్భంగా శనివారం ధాత్రి నారాయణ స్వరూప శ్రీకృష్ణ తులసి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు ప్రహ్లద్ శర్మ, శేఖర్, శ్యాం సుందర్ ల వేద మంత్రోఛ్ఛరణలతో శ్రీకృష్ణ తులసి కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ వివాహ మహోత్సవానికి తాడిచర్ల, మల్లారం, పెద్దతూండ్ల, చిన్నతూంఢ్ల, అడ్వాలపల్లి కొయ్యూరు తదితర గ్రామాల్లోని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వివాహానికి హాజరైన భక్తులకు రేపాల నాగజ్యోతి, శ్రీనివాస్ ల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ కమిటీ, భజన మండలి సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక భక్తి గీతాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.