ప్రభుత్వ కళాశాల ఆకస్మిక తనిఖీ
మహాదేవపూర్ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి భూక్యా వెంకన్న మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కళాశాల నిర్వహణ సంబంధిత పలు రికార్డులు ఆయన పరిశీలించారు. కళాశాలలో తరగతుల నిర్వహణ ఎంసెట్ బోధన, కళాశాలకు హాజరు కాని విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధ్యాపకులను ఆదేశించారు.