ఘనంగా పదవి విరమణ అభినందన సన్మానోత్సవం

82చూసినవారు
డోర్నకల్ మండలం ముల్కలపల్లి జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో సోమవారం కుసుమ నాగేశ్వర రావు - పద్మావతి పదవి విరమణ అభినందన సన్మానోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పదవి విరమణ దంపతులను తోటి ఉపాధ్యాయులు, తదితరులు పూల దండలతో, శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారి లక్ష్మా, ప్రధానోపాధ్యాయులు రుక్మాంగధర రావు, అమ్మ ఆదర్శ కమిటి అధ్యక్షురాలు స్వప్న, విద్యార్థులు, పాఠశాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్