చిరుతపులి చర్మం స్వాధీనం చేసుకున్న అధికారులు

74చూసినవారు
చిరుతపులి చర్మం విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్న ఘటన ములుగు జిల్లా వాజేడులో జరిగింది. ఓఎస్డి గితే మహేశ్ బాబాసాహెబ్ తెలిపిన వివరాల ప్రకారం ఛత్తీస్గఢ్ నుంచి జాడి మహేందర్ అనే వ్యక్తి చిరుతపులి చర్మం అమ్మకానికి వస్తున్నాడని పక్కా సమాచారం వచ్చింది. ఈ మేరకు ఏటూరునాగారం ఏఎస్పీ శివమ్ ఉపాధ్యాయ, ఫారెస్ట్ రేంజర్ చంద్రమౌళి, పోలీసు సిబ్బంది చంద్రుపట్ల క్రాస్ వద్ద అతడిని పట్టుకుని కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్