ఇంటిగ్రేటెడ్ స్కూల్ డోర్నకల్ పట్టణంలోనే నిర్మాణం చేయాలని యునైటెడ్ ఆధ్వర్యంలో డోర్నకల్ కి చెందిన సమాచార హక్కు రక్షణ చట్టం నియోజకవర్గ ఇన్ ఛార్జ్, యునైటెడ్ యూత్ అధ్యక్షులు కుందోజు లవన్ సోమవారం హైదరాబాద్ లోని తెలంగాణ సచివాలయం ముందు ప్లకార్డుతో నిరసన తెలిపారు. డోర్నకల్ సమస్యను సచివాలయం వరకు తీసుకెళ్తున్నట్లు వారు తెలిపారు. దీనితో అక్కడ సమస్య ఏంటో అని పలువురు ఆరా తీస్తున్నారు.