డోర్నకల్: హెడ్ కానిస్టేబుల్ తిర్మల్ రావు మృతి

77చూసినవారు
డోర్నకల్: హెడ్ కానిస్టేబుల్ తిర్మల్ రావు మృతి
డోర్నకల్ మండల కేంద్రంలోని సుభాస్ స్ట్రీట్ కు చెందిన హెడ్ కానిస్టేబుల్ కనకరాజు తిర్మల్ రావు గురువారం మృతి చెందారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మం జిల్లాలోని మహిళా పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు. మూడు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారని తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

సంబంధిత పోస్ట్