డోర్నకల్: రేపు పలు ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిపివేత

57చూసినవారు
డోర్నకల్: రేపు పలు ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిపివేత
డోర్నకల్ మండలం వెన్నారం, రాము తండా, బట్టు తండా, లకావత్ తండా, రామ కుంట తండా, ఉయ్యాలవాడ, గుర్రాల కుంట తండా, టేకుల తండా ప్రాంతాలలో సోమవారం ఉ. 9 గంటల నుంచి మ. 12 గంటల వరకు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు అసిస్టెంట్ లైన్ మెన్ విజయ్ భాస్కర్ ఆదివారం తెలిపారు. 11కేవీ లైన్లకు అడ్డుగా వచ్చిన చెట్ల కొమ్మలను తొలగిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ విషయాన్ని విద్యుత్ వినియోగదారులు గమనించి సహకరించాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్