డోర్నకల్ నియోజకవర్గం కురవి మండలం పొలంపెళ్లి తండాకు చెందిన ఉద్యమ నాయకుడు తేజావత్ లక్ష్మణ్ సోదరుడు ఇటీవలే అనారోగ్యంతో మరణించగా, శుక్రవారం లక్ష్మణ్ ను వారి కుటుంబ సభ్యులను కురవి మండల ఎంపీపీ గుగులోత్ పద్మావతి రవినాయక్ పరామర్శించాడు. వారితో పాటు కురవి మండల టిఆర్ఎస్ సోషల్ మీడియా ఇంచార్జ్ బాణోత్ రమేష్ నాయక్, గ్రామపార్టీ అధ్యక్షుడు బాదావత్ బాలు, రఘు, భద్రు తదితరులు పాల్గొన్నారు.