జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపికైన తేలురి రామన్నని శనివారం డోర్నకల్ మండల పిఆర్టియు శాఖ ఆధ్వర్యంలో, ఏర్పాటు చేసిన సన్మాన సభలో దంపతుల ను సన్మానం చేశారు. గత సెప్టెంబర్ లోనే అవార్డుకు ఎంపికైనప్పటికీ కోవిడ్ నిబంధనలు, ఆన్లైన్ క్లాసులో దృష్ట్యా సభ నిర్వహించారు. లాక్ డౌన్ సమయంలో కూడా అకుంఠిత దీక్షతో రామన్న కోవిద్ నిబంధనలు, జాగ్రత్తలు పాటిస్తూ పేపర్ పెన్సిల్ కార్యక్రమం, ప్రతి విద్యార్థి కి అందుబాటులో ఉంటూ విద్యాబుద్ధులు నేర్పించారు. డోర్నకల్ మండల శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంఘ రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ జాగర్లమూడి శ్రీధర్, ములకలపల్లి కాంప్లెక్స్ హెచ్ఎం ఆంగోతు లక్ష్మణ్ , మన్నెగూడెం పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సంఘ బాధ్యులతో పాటు మండల అధ్యక్షులు సీతారాముల, కార్యదర్శి వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పి ఆర్ టి యు యూనియన్ సభ్యులు ప్రతి సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం, అవార్డులకు ఎంపిక కావడం చాలా సంతోషకరమని అధ్యక్షులు తెలిపారు