రాష్ట్రవ్యాప్తంగా ఆన్లైన్ క్లాసులో ఎంత పకడ్బందీగా జరుగుతున్నాయో కానీ మహబూబాబాద్ జిల్లాలో మాత్రం మొదటినుంచి తీవ్ర కృషి జరుగుతున్నది. కరోనా భారీగా విజృంభిస్తున్న సమయంలోనూ ఇక్కడి అధికారులు సూచనల మేరకు ఉపాధ్యాయుల ఇంటింటికి తిరిగి పాఠాలు బోధించడం వర్క్షీట్లను పంచడం హోంవర్క్ ఇవ్వడం వంటి పనులు చేపట్టారు. ఒకరకంగా రాష్ట్రం ప్రవేశపెట్టిన కార్యక్రమాలకు మార్గదర్శి అయ్యారు. కరోనా కాలంలో అందరూ ఇళ్ళల్లో ఉంటే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఉపాధ్యాయులు ప్రతి ఇల్లు తిరిగి వర్క్ షీట్ లో పంచటం కొన్నిచోట్ల వివాదానికి దారి తీసిన,పై అధికారుల పర్యవేక్షణ తనిఖీ తీవ్ర ఒత్తిడి వల్ల ఉపాధ్యాయులు తమ కర్తవ్యాలు కొనసాగించారు.
ఉపాధ్యాయుల పర్యవేక్షణ సరిగా జరుగుతుందా లేదా ప్రతి రోజు ఉపాధ్యాయ డైరీ రాస్తున్నారా పిల్లలకు వర్క్ డైలీ ఇస్తున్నారా లేదా పర్యవేక్షణ సరిగా జరుగుతుందా లేదా ఈ అంశాలన్నీ పరిశీలించడానికి తనిఖీ చేయడానికి కాంప్లెక్స్ హెడ్మాస్టర్ లు ప్రతి రోజూ కొన్ని పాఠశాలలు చొప్పున తనిఖీ చేస్తున్నారు. స్థానికులకు తల్లిదండ్రులకు ఈ చర్యలన్నీ వింతగా అనిపిస్తుంది. మా డ్యూటీ ఏం చేస్తున్నాం అని పై నుండి కింది స్థాయి ఉపాధ్యాయుల వరకు అందరూ పాటిస్తున్నారు.