బీసీ విద్యార్థి సంఘం డోర్నకల్ నియోజకవర్గ అధ్యక్షుడుగా ముండ్ల ఉపేందర్ ను తెలంగాణ రాష్ట్ర కో కన్వీనర్ వీరబోయిన లింగయ్య యాదవ్ ఎన్నుకున్నారు. ముండ్ల ఉపేందర్ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నర్సింహులపేట మండలం వంతడుపుల గ్రామానికి చెందినవాడు. ఈ సందర్భంగా ఉపేందర్ మాట్లాడుతూ. తనకు ఈ బాధ్యతలు అప్పగించిన పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఆయన మాట్లాడుతూ. బీసీ విద్యార్థుల హక్కుల కోసం పోరాటం చేస్తానని, ఎల్లప్పుడూ వారి అభివృద్ధి కోసం పాటుపడతానని ఆయన మాట ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాసాని దేవేందర్ యాదవ్, గుండాల నవీన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.