విద్యార్థిని విద్యార్థులకు ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్ని వసతి గృహాలను సంబంధిత నోడల్ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్ అన్నారు. శుక్రవారం జనగాం జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల గదిలో రెండు ఫ్యాన్లు ఉండడంతో అదనంగా మరో రెండు ఫ్యాన్లు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.